‘విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత’
భిక్కనూరు: రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం జంగంపల్లిలో విద్యుత్‌శాఖ నిర్వహించిన పొలంబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల తమ విద్యుత్ సమస్యలను స్థానిక సిబ్బందికి తెలపాలన్నారు. వారు పట్టించుకోకపోతే 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే వెంటనే సంబంధిత సిబ్బందిపై చర్య తీసుకోవడంతో పాటు సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. విద్యుత్ షాక్‌కు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యుత్ కెపాసిటర్ల బిగింపు వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. కార్యక్రమంలో డీఈ కల్యాణ్ చక్రవర్తి, ఏడీఈ సుదర్శనరెడ్డి, ఏఈ బాలాజీ, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment