విశ్వవిద్యాలయ క్రీడల్లో కామారెడ్డి క్రీడాకారుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

విశ్వవిద్యాలయ క్రీడల్లో కామారెడ్డి క్రీడాకారుల ప్రతిభ

Published Fri, Dec 13 2024 1:44 AM | Last Updated on Fri, Dec 13 2024 1:44 AM

విశ్వ

విశ్వవిద్యాలయ క్రీడల్లో కామారెడ్డి క్రీడాకారుల ప్రతిభ

కామారెడ్డి అర్బన్‌: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర కళాశాలల అథ్లెటిక్స్‌ పోటీల్లో కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల క్రీడాకారులు సత్తా చాటినట్టు ప్రిన్సిపాల్‌ కె.విజయ్‌కుమార్‌ తెలిపారు. వంద, రెండు వందల మీటర్ల పరుగులో సీహెచ్‌.కావ్య ప్రథమ స్థానం, 800 మీటర్ల పరుగులో బి.హరిత ద్వితీయ స్థానం పొందగా 1500 మీటర్ల పరుగులో ఎం.అఖిత ప్రథమ స్థానం, 800 మీటర్ల పరుగులో డి.భరత్‌రాజ్‌ ద్వితీయ స్థానం పొందినట్టు వెల్లడించారు. గురువారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో క్రీడాకారులను అభినందించారు.

‘పాడి పశువుల పెంపకంపై దృష్టి సారించాలి’

భిక్కనూరు: రైతులు పాడిపశువుల పెంపకంపై దృష్టి సారించాలని జిల్లా పశుసంవర్ధక శాఖాఽధికారి సంజయ్‌కుమార్‌ అన్నారు. గురువారం కాచాపూర్‌లో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రోజురోజుకు పాల డిమాండ్‌ పెరుగుతుందని.. డిమాండ్‌ పెరిగినప్పుడు ధర కూడా గిట్టుబాటు అవుతుందని ప్రతి రైతు తప్పని సరిగా పాడి పశువులను పెంచుకోవాలని సూచించారు. పశువులకు తప్పని సరిగా వైద్య పరీక్షలు చేయించాలని పశువైద్య సిబ్బంది సూచించిన సలహాలను పాటించాలన్నారు. పశువైద్యులు దేవేందర్‌, అనిల్‌రెడ్డి, రమేష్‌ రాథోడ్‌, రైతులు పాల్గొన్నారు.

స్టేడియం స్థలం పరిశీలన

గాంధారి(ఎల్లారెడ్డి): అదనపు కలెక్టర్‌ విక్టర్‌ గురువారం మండలంలో పర్యటించారు. జువ్వాడి శివారులో నిర్మించ తలపెట్టిన స్టేడియం స్థలాన్ని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్‌తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రెవెన్యూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని రికార్డులు పరిశీలించారు. రికార్డులు, స్టేడియం నిర్మించే స్థల విస్తీర్ణం రికార్డులో పక్కాగా పొందుపర్చాలని సూచించారు. అనంతరం జువ్వాడి గ్రామాన్ని సందర్శించి ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు. ఎంపీడీవో రాజేశ్వర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీటీ రవి, గిర్దావర్‌, సర్వేయర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

‘రాజ్యాంగాన్ని

కాపాడుకోవాలి’

బీబీపేట: భారత రాజ్యాంగ ప్రచార ఉద్యమ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉప్పర్‌పల్లి, జనగామ గ్రామాల్లో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద దళిత బహుజన ఫ్రంట్‌ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని వారు అన్నారు. నాయకులు తలారి ప్రభాకర్‌, అంబేడ్కర్‌ సంఘం అధ్యక్షుడు రాజబాబు, రాము,జాన్‌,శంకర్‌, లక్ష్మ ణ్‌, సాయిలు, నరేష్‌,ప్రసాద్‌, బాబు పాల్గొన్నారు.

నేడు ఇంటింటికి సీపీఎం కార్యక్రమం

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలో నేడు ఇంటింటి సీపీఎం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కె.చంద్రశేఖర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్‌వీ. రమ హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
విశ్వవిద్యాలయ క్రీడల్లో కామారెడ్డి క్రీడాకారుల ప్రతిభ 1
1/2

విశ్వవిద్యాలయ క్రీడల్లో కామారెడ్డి క్రీడాకారుల ప్రతిభ

విశ్వవిద్యాలయ క్రీడల్లో కామారెడ్డి క్రీడాకారుల ప్రతిభ 2
2/2

విశ్వవిద్యాలయ క్రీడల్లో కామారెడ్డి క్రీడాకారుల ప్రతిభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement