కోడల్ని ఇంట్లోకి రానిస్తలేరు.. | - | Sakshi
Sakshi News home page

కోడల్ని ఇంట్లోకి రానిస్తలేరు..

Published Sun, Aug 11 2024 2:08 AM | Last Updated on Sun, Aug 11 2024 11:02 AM

కోడల్ని ఇంట్లోకి రానిస్తలేరు..

కొడుకు మరణానంతరం గెంటేసిన అత్తామామ 

 ముగ్గురు పిల్లలతో నానాతంటాలు పడుతున్న బాధితురాలు 

 భర్త సంవత్సరీకం అత్తింటి ఎదుటే నిర్వహణ 

హుజూరాబాద్‌రూరల్‌: కొడుకు చనిపోయాడు.. ముగ్గురు పిల్లలున్న కోడల్ని చేరదీయాల్సిన అత్తామామ ఆమెను ఇంట్లో నుంచి గెంటేశారు.. బాధితురాలు భర్త మృతిచెందిన బాధను దిగమింగుకొని ఏడాదిగా నానాతంటాలు పడుతూ పిల్లలను పోషి ంచుకుంటోంది. చివరికి భర్త సంవత్సరీకం రోజైనా రానిస్తారని ఆశతో వస్తే తాళం వేసి వెళ్లిపోయిన అమానవీయ ఘటన శనివారం హుజూరాబా ద్‌లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం జిలుగుల గ్రామానికి చెందిన రావుల మంజుల–సురేందర్‌ దంపతుల కూతురు రవళిని హుజూరాబాద్‌కు చెందిన వీరగోని లచ్చమ్మ–మొగిలి దంపతుల కుమారుడు శ్రవణ్‌కు ఇచ్చి, ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఇద్ద రు కూతుళ్లు, ఒక బాబు జన్మించారు. శ్రవణ్‌ హు జూరాబాద్‌ పట్టణంలో గిఫ్ట్‌ షాపు నిర్వహించేవాడు. ఆనందంగా సాగుతున్న జీవితంలో ఒక్కసారిగా కుదుపు.. శ్రవణ్‌కు కేన్సర్‌ సోకడంతో గతేడాది ఆగస్టులో చనిపోయాడు.

కొడుకే లేనప్పుడు నువ్వెందుకని..
భర్త మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న రవళికి అత్తామామ నరకం చూపించారు. తమ కొడుకే లేనప్పుడు నీతో మాకేం పని అంటూ బయటకు గెంటేశారు. పూజారులు కూడా ఆరు నెలలపాటు ఇల్లు వదిలేయాలని చెప్పడంతో రవళి ముగ్గురు పిల్లలతో కలిసి, అద్దె ఇంట్లో ఉంటూ గిఫ్ట్‌ షాపు నడుపుతోంది. పలుమార్లు అత్తామామను కలిసి, తనను, పిల్లల్ని చేరదీయాలని వేడుకున్నా ససేమిరా అన్నారు. 

కనీసం శ్రవణ్‌ సంవత్సరీకం రోజైనా(శనివారం) పిలుస్తారని ఆశతో ఎదురుచూసింది. కానీ, రమ్మనకపోగా ఇంటికి తాళం వేసుకొని, వెళ్లిపోయా రు. చేసేదేమీ లేక రవళి అత్తింటి ఎదుటే భర్త సంవత్సరీకం నిర్వహించింది. చిన్న పిల్లలతో కలిసి ఆమె కార్యక్రమం చేయడం చూసి, చుట్టుపక్కలవారు కంటతడి పెట్టారు. రవళికి న్యాయం చేయాలని కోరా రు. ఈ విషయమై ఆమె అత్తామామను సంప్రదించే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement