● ప్రజావాణిలో అర్జీదారుల ఆవేదన ● 240 ఫిర్యాదులు స్వీకరణ
కరీంనగర్ అర్బన్: సమస్యలతో వేగలేకపోతున్నాం.. మా మొర వినరూ అంటూ అర్జీదారులు గోడు వెల్లబోసుకున్నారు. మండలస్థాయిలో అధికారుల నుంచి నిరాదరణే ఎదురవుతోందని కలెక్టర్ కరుణించాలని వేడుకున్నా రు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా వాణికి 240 అర్జీలు రాగా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మికిరణ్, నగరపాలక కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ అర్జీలను పరిశీలించి, పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎక్కువగా భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అర్జీలు రాగా పలువురు తమ ఆవేదనను వివరించారు.
నా కొడుకు జాడ చెప్పరూ
నాకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు గోవర్ధన్ ఎప్పుడో మరణించగా వాళ్ల సంతానం నన్ను పోషిస్తున్నారు. మరో కొడుకు తిరుపతయ్య కరీంనగర్‌లో ఇల్లు కట్టుకున్నాడు. పెద్దకొడుకు సంతానం ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు. చిన్న కొడుకు ఎక్కడుంటాడో తెలియదు. కలెక్టర్ సాయం చేస్తారని వచ్చిన.
– ఇల్లందుల లక్ష్మి, తాటిపల్లి, కొడిమ్యాల
Comments
Please login to add a commentAdd a comment