‘భూ భారతి’తో సమస్యలు పరిష్కారం
● తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి
కొత్తపల్లి(కరీంనగర్): నిర్వీర్యమైన గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునః ప్రతిష్టాపనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఎంప్లాయీస్ చైర్మన్ వి.లచ్చిరెడ్డి పేర్కొన్నారు. రైతులు, ప్రజల భూ సమస్యలు పరిష్కరించేందుకు ధరణిస్థానంలో ప్రభుత్వం భూ భారతి చట్టం–2024ను తీసుకొచ్చి ందన్నారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్‌లోని ఓ ప్రైవేట్ సమావేశ మందిరంలో సోమవారం తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం, నూతన కార్యవర్గ ఎన్నికకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమానికి అసోసియేషన్ ముందుంటుందని తెలిపారు. అనంతరం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల టీజీఆర్‌ఏస్‌ఏ కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కరీంనగర్ ఆర్డీవో కుందారపు మహేశ్వర్, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి పాక రమేశ్, సెక్రటరీ పూల్‌సింగ్, మహిళా అధ్యక్షురాలు రాధ, టీజీఆర్‌ఏస్‌ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.భిక్షం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment