కాలువ నీటిలో కొట్టుకు వస్తున్న మహిళ మృతదేహం
బళ్లారిఅర్బన్: గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళూరు రోడ్డు శ్రీనగర్ కాలనీ వద్ద కాలువలో ఓ మహిళ(50) మృతదేహం నీటిలో కొట్టుకు రావడంతో స్థానికులు గమనించి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మహిళకు ఇంకా ప్రాణం ఉందేమో? అని ప్రయత్నించినా అప్పటికే ప్రాణం పోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ సతీష్, ఎస్‌ఐ సంతోష్ తమ పోలీసు బృందంతో ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాలువ నీటిలో నుంచి మహిళ మృతదేహాన్ని వెలికి తీసిన యువకుడిని అభినందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం అంబులెన్స్ ద్వారా విమ్స్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ పోలీసులు తెలిపారు. కాగా గురువారం ఉదయం హవంబావి సమీపంలో ఈ మహిళ కాలు జారి కాలువలో పడి మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment