కర్ణాటక: అన్ని వేళల్లో తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త.. అనుమానంతో హంతకునిగా మారాడు, భార్య శీలాన్ని శంకించి ఆమైపె హత్యాయత్నం చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైసూరు జిల్లా పిరియాపట్టణ తాలూకా ముత్తినముళ్లుసోగె గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాలు.. గ్రామం నివాసి ప్రసన్న (36), భార్య శ్వేత (30) ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. క్రమంగా ఆమైపె అనుమానం పెంచుకుని నిత్యం వేధించేవాడు. అనేకసార్లు పోలీస్‌స్టేషన్‌లో రాజీ పంచాయితీలు జరిగాయి.
మరదలితో పెళ్లి చేయాలని
మరోవైపు శ్వేత చెల్లెలిపై మనసు పడ్డ ప్రసన్న ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలని భార్యను ఒత్తిడి చేసేవాడు. దీంతో విసిగిపోయిన శ్వేత నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో గురువారం ఉదయం శ్వేత పనికి వెళ్తుండగా మార్గం మధ్యలో అడ్డగించి ఇంటికి రమ్మని బలవంతం చేసాడు. శ్వేత నిరాకరించడంతో ఆమెను కత్తితో ఇష్టానుసారం పొడిచి పారిపోయాడు. ఇంటికి వెళ్లిపోయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్రక్త స్రావంతో రోడ్డుపై విలవిలలాడుతున్న శ్వేతను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్వేత ఐసీయూలో చికిత్స పొందుతోంది. పిరియాపట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment