గర్భిణిని ఆటోలో తరలిస్తున్న దృశ్యం
●అందుబాటులో లేని అంబులెన్స్
గంగావతి: కనకగిరి తాలూకాలోని హులిహైదర్‌కు అంబులెన్స్ లేని కారణంగా ఓ గర్భిణిని కాన్పు కోసం ఆటోలో తీసుకురావాల్సిన దుస్థితి ఏర్పడింది. గ్రామస్తులు తమ వద్దనున్న అంబులెన్స్ నెంబర్‌కు ఫోన్ చేయగా అక్కడి నుంచి మీ గ్రామానికి రావడానికి మూడు గంటలు పడుతుందని తెలియజేయడంతో వారు ఆటోలో ఆమెను ఆస్పత్రికి తరలించారు. సకాలంలో ఆస్పత్రికి రావడంతో ఓ ఆడశిశువుకు ఆమె జన్మనిచ్చింది. ఏదేమైనా తమ గ్రామం చుట్టు పక్కల గ్రామాలకు అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో లేకపోవడం వల్ల నానాఇబ్బందులు పడాల్సి వస్తోందని, ప్రాణాపాయ స్థితిలో ఎందరో ప్రాణాలను కోల్పోయిన ఘటనలు జరిగాయని మాజీ జెడ్పీ సభ్యుడు హనుమేష్ నాయక్ ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment