యశవంతపుర: కర్ణాటక ఎన్నికలు కెజిఎఫ్‌ను తలపిస్తున్నాయి. పోలింగ్‌కు ముందు జరుగుతున్న సోదాల్లో చెక్‌పోస్టుల వద్ద బంగారం భారీగా పట్టుబడుతోంది. అయితే ఇందులో ఎంత అక్రమం, ఎంత సక్రమం అన్నది త్వరలో తేలనుంది.
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ కర్ణాటకలో భారీ ఎత్తున బంగారు నగలు పట్టుబడ్డాయి. పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టుల వద్ద జరిగిన తనిఖీల్లో లెక్కాచారం లేని రూ.21.5 కోట్ల విలువైన బంగారు నగలను శుక్రవారం దావణగెరె సమీపంలో ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు దావణగెరె సమీపంలోని లోకిరెకె చెక్‌పోస్టు వద్ద ఎన్నికల అధికారిణి రేణుక, వాణిజ్య పన్నులశాఖ ఉప కమిషనర్ మంజునాథ్ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో వచ్చిన జీపును సోదా చేయగా భారీగా బంగారు నగలు బయట పడ్డాయి. అయితే ఈ నగలను మార్చి 6, 8 తేదీల్లో కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు బయట పడింది. వీటి విలువ రూ. 12.5 కోట్లు ఉంటుందని అధికారులు లెక్కించారు. పాత బిల్లులను లెక్కలోకి తీసుకోని అధికారులు ఆ నగలను స్వాధీనం చేసుకున్నారు.
రామనగరలో 30 కేజీల బంగారం స్వాధీనం
రామనగర హెజ్జాల చెక్‌పోస్టులో ఎన్నికల అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. బెంగళూరు నుంచి మైసూరు వెళ్తున్న కారును సోదా చేయగా రూ.10 కోట్ల విలువైన 30 కేజీల బంగారం, 10 కేజీల వెండి బయట పడింది. ఈ నగలను మలబార్ గోల్డ్ సంస్థకు చెందినవిగా గుర్తించారు. అయితే సరైన పత్రాలు లేని కారణంగా స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలను చూపించి నగలు తీసుకెళ్లాలని సూచించారు.
మైసూరు జిల్లాలో....
మైసూరు : లోక్ సభ ఎన్నికల వేళ ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న కోట్లాది రూపాయల నగదు, కిలోల లెక్కన బంగారు నగలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్, ఎన్నికల అధికారి శిల్ప నాగ్ తెలిపినమేరకు...బెంగళూరు నుంచి కొళ్లెగాలకు వెళ్తున్న కారును చామరాజనగర జిల్లా సత్తెగాల చెక్‌పోస్ట్ వద్ద ఎన్నికల అధికారులు అడ్డుకొని సోదా చేశారు. 1,57,87,000 నగదు, 2కిలోల 170 గ్రాముల బంగారం రవాణా వెలుగు చూసింది.
ఈ నగదు ఎక్కడినుంచి ఎక్కడికి తర లిస్తున్నారని కారులో ప్రయాణిస్తున్న కార్తిన్, చిరాంత్‌ను అధికారులు ఆరా తీయగా ఆధారాలు చూపలేకపోయారు. దీంతో నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మైసూరులోని మండకళ్లి విమానాశ్రయం చెక్‌పోస్ట్ వద్ద ఎస్‌ఎస్‌ఐఈ అధకారిశివకుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల సహాయ అధికారి నందీష్, తహసీల్దార్ మహేష్‌కుమార్, నోడల్ ఆఫీసర్ విశ్వనాథ్ బృందం తనిఖీలు చేపట్టింది. ఆ సమయంలో అటుగా వచ్చిన మహ్మద్ జాసిన్ వ్యక్తిని సోదా చేయగా రూ.5.50 లక్షల నగదు లభించింది. ఇతను నగదుతో హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు గుర్తించారు. రసీదు లేకపోవడంతో నగదు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment