మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
చింతకాని: ప్రభుత్వ చేయూత, స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు అభివృద్ధి సాదించాలని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరక్టర్ చంద్రశేఖర్ సూచించారు. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో విజయభారతి మహిళా మండలి, సంస్థ ఆధ్వర్యాన మగ్గం వర్క్, జూట్ బ్యాగ్‌లు, వర్మీ కంపోస్ట్ తయారీపై శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు గురువారం ఆయన సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేలా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఎంపీడీఓ రామయ్య, కోర్సు కోఆర్డి నేటర్ వహీద్, విజయభారతి మహిళా మండలి అధ్యక్షురాలు విజయలక్ష్మితదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment