ఆర్చరీ జట్ల ఎంపికకు పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి ఖమ్మం జిల్లా బాలబాలికల ఆర్చరీ జట్ల ఎంపికకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో గురువారం పోటీలు నిర్వహించారు. జూనియర్స్ విభాగంలో నిర్వహించిన ఈ పోటీలను ఇంటెలిజెన్స్ ఏఎస్పీ రామోజీ రమేష్ ప్రారంభించి మాట్లాడారు. జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని పోటీల్లో రాణించాలని సూచించారు. ఆర్చరీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పుట్టా శంకరయ్య, డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డితో పాటు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, నగేష్, కళ్యాణ్, మారెప్ప తదితరులు పాల్గొన్నారు. కాగా, జట్ల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అసోసియేషన్ బాధ్యులు తెలిపారు.
‘వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు
అప్పగించేలా కుట్ర’
కొణిజర్ల: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసి రైతులను తరిమేయాలని కుట్ర పన్నిందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు విమర్శించారు. కొణిజర్ల మండలం తనికెళ్లలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమగ్ర వ్యవసాయ పంటల మద్దతు ధర చట్టం తీసుకొచ్చి రైతులకు న్యాయంచేయాలని డిమాండ్ చేశారు. అలాగే, తెలంగాణలో సాదా బైనామాలు ఉన్న వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని, రైతుల బీమాను రూ.10 లక్షలకు పెంచాలన్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దొండపాటి రమేష్, కొండపర్తి గోవిందరావు, నాయకులు గుమ్మడెల్లి సైదులు, పీ.వీ.రావు, కూచిపూడి రవి, యాసా వెంకటేశ్వర్లు, తండు సోమయ్య, గడల భాస్కరరావు, లేడిబోయిన గోపాలరావు, పెద్దమళ్ల రత్తయ్య, లకావత్ రాములు నాగరాజు పాల్గొన్నారు.
సాయిమందిరంలో అన్నదానానికి రూ.10లక్షల విరాళం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం 14వ డివిజన్ మధురానగర్‌లోని సాయి మందిరంలో ప్రతీ గురువారం అన్నదానం నిర్వహణకు దాతలు రూ.10లక్షల విరాళం ప్రకటించారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌గా ఇంజనీరింగ్ ఉద్యోగం చేస్తున్న మధురానగర్‌కు చెందిన పోలూరి ఉమామహేశ్వరరెడ్డి – సుందరహరిత దంపతులతో పాటు వారి కుటుంబీకులు నాగసాయి తన్విశ్రీ, రిషినందన్‌రెడ్డి గురువారం ఆలయ కమిటీ బాధ్యులకు రూ.10 లక్షల చెక్కు అందించారు. ఈ సందర్భంగా దాతలను డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం సన్మానించారు. ఈకార్యక్రమంలో కాలనీకి చెందిన పోలూరి మహేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ తోడ్పాటుతో ఆర్థికంగా ఎదగాలి
పెనుబల్లి: ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తూ జీవితంలో ఎదగాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ తెలిపారు. పెనుబల్లికి చెందిన మహిళా సంఘాల సభ్యులకు మంజూరైన ఐదు ఇందిరా మహిళా శక్తి యూనిట్లను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా అందించే తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటే ఫలితం ఉంటుందన్నారు. యూనిట్ ఏర్పాటు సమయాన మార్కెటింగ్ అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. కల్లూరు ఆర్డీఓ రాజేందర్, అదనపు డీఆర్డీఓ నూరొద్దీన్, తహసీల్దార్ ప్రతాప్, ఎంపీడీఓ అన్నపూర్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment