సర్వే.. సమాప్తం | - | Sakshi
Sakshi News home page

సర్వే.. సమాప్తం

Published Sun, Jan 19 2025 12:28 AM | Last Updated on Sun, Jan 19 2025 12:28 AM

-

● ‘ఇందిరమ్మ’ ఇళ్ల జాబితాపై సూపర్‌చెక్‌ చేస్తున్న ఎంపీడీఓలు ● గ్రామసభల్లో లబ్ధిదారుల జాబితా వెల్లడికి ఏర్పాట్లు ● ఆపై అభ్యంతరాల స్వీకరణ, విచారణ

8లో

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రజాపాలన సభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం అందిన దరఖాస్తుల ఆధారంగా చేపట్టిన క్షేత్రస్థాయి సర్వే పూర్తయింది. మండల స్థాయిలో పూర్తిగా ముగియగా, కేఎంసీ పరిధి లో తుదిదశలో ఉంది. మరోవైపు యాప్‌లో అప్‌లోడ్‌ చేసిన వాటిలో నుంచి ఐదు శాతం దరఖాస్తులను ఎంపీడీఓలు సూపర్‌ చెక్‌ చేస్తున్నారు. ఆతర్వాత మరోసారి సీనియర్‌ అధికారులతో పరిశీలన ఉంటుంది. ఆపై ఈనెల 21నుంచి మొదలయ్యే గ్రామ, వార్డు సభల్లో లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తారు. అనంతరం అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించాక 26వ తేదీ నుంచి విడతల వారీగా లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు కానున్నాయి.

మండలాల్లో చకచకా..

మండలాల్లో ఇందిరమ్మ దరఖాస్తుల సర్వే 99 శాతం మేర పూర్తయింది. మండలాల్లో 3,03,878 దరఖా స్తులకు 3,03,756 దరఖాస్తులను పరిశీలించారు. ఇళ్లకు వెళ్లి వారి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించడంతోపాటు నివాసముంటున్న ఇంటి ఫొటో తీసి మొబైల్‌యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. రఘునాథపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, చింతకాని, మధిర, ఏన్కూరు, కామేపల్లి, వైరా, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ మండలాల్లో నూరు శాతం సర్వే పూర్తవగా, మిగిలిన మండలాల్లో 122 దరఖాస్తులు మిగిలినా వాటికి సంబంధించిన వారు అందుబాటులో లేక ఆలస్యం జరుగుతోందని సమాచారం. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే పాలేరులో 17, మధిరలో 76, వైరాలో ఎనిమిది, సత్తుపల్లిలో 21 దరఖాస్తులు పరిశీలించాల్సి ఉంది.

ఖమ్మం కార్పొరేషన్‌లోనూ..

ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోనూ సర్వే చివరకు వచ్చేసింది. ఇక్కడ మొత్తం 53,991 దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు 52,708 దరఖాస్తులను పరిశీలించి యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. మిగిలిన 1,283 దరఖాస్తులను త్వరగా పూర్తిచేసేలా అధికారులు నిమగ్నమయ్యారు. పరిశీలన పూర్తయ్యాక ఈనెల 20న రీ వెరిఫికేషన్‌ చేసి గ్రామ/వార్డు సభల్లో జాబితాలు ప్రకటిస్తారు. అక్కడ ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే నమోదు చేసుకుని 23, 24వ తేదీల్లో విచారణ చేపడతారు. మరోచోట ఇల్లు ఉందనో.. బీపీఎల్‌ కోటా కిందకు రారనో ఫిర్యాదులు వస్తే వాటిపై విచారణ చేపట్టి ఈనెల 26నుంచి మంజూరు ప్రక్రియ ప్రారంభిస్తారు.

నియోజకవర్గాల వారీగా దరఖాస్తులు, సర్వే

నియోజకవర్గం దరఖాస్తులు సర్వే పూర్తయినవి

ఖమ్మం 70,324 69,041

పాలేరు 70,913 70,896

మధిర 69,918 69,842

వైరా 68,581 68,573

సత్తుపల్లి 78,133 78,112

మొత్తం 3,57,869 3,56,464

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement