భూ సేకరణపై దృష్టి పెట్టండి...
● రిటైనింగ్ వాల్స్ నిర్మాణంలో వేగం పెంచాలి ● పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ శ్రీజ
ఖమ్మంఅర్బన్: ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల పరిధిలో పలు కాలనీలను మున్నేటి ముంపు నుంచి రక్షించేలా రూ.690 కోట్లతో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్స్ పనులను శనివారం అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ శనివారం పరిశీలించారు. పనుల ప్రగతి, భూసేకరణపై జలవనరులశాఖ ఎస్‌ఈ మంగళపుడి వెంకటేశ్వర్లు, ఆర్‌డీఓ నర్సింహారావుతో సమీక్షించారు. పనులతో పాటు అవసరమైన భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో జలవనరులశాఖ డీఈలు మన్మధరావు, ఉదయ్‌ప్రతాప్, ఏఈలు అరుణ, మనుదీప్ తదితరులు పాల్గొన్నారు.
నారపునేనిపల్లి యూపీఎస్‌లో పరిశీలన
వైరారూరల్: వైరా మండలం నారపునేనిపల్లిలోని యూపీఎస్‌ను శనివారం అదనపు కలెక్టర్ శ్రీజపరిశీలించారు. గతంలో పాఠశాలలో ఒక విద్యార్థిని మాత్రమే ఉండగా అధికారుల చొరవతో మరో ముగ్గురు చేరారు. ఈమేరకు పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రహరీ నిర్మాణం, క్రీడాసామగ్రి ఏర్పాటు తదితర అంశాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈమేరకు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించడం వల్ల లాభాలను గుర్తించాలని సూచించారు. డీఈఓ సోమశేఖరశర్మ, ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ పి.సరస్వతి, ఎంపీఓ జ్యోత్స్నాదేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment