ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందుతాయని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్పష్టం చేశారు. అయితే, తొలిదఫా మంజూరు కాకున్నా ఆందోళన చెందాల్సి న పని లేదని, దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక నిరంతరం కొనసాగుతుందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ ఈనెల 26నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. అర్హులందరికీ పథకాలు అందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. ఈ నేపథ్యాన దరఖాస్తు చేసుకోని వారు ఉంటే గ్రామసభల్లో లేదా ఎంపీడీఓ, తహసీల్ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో సమర్పించాలని సూచించారు. లబ్ధిదారుల జాబితాపై సందేహాలు ఉంటే కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్‌కు 1077 నంబర్ ద్వారా ఫోన్ చేయొచ్చని కలెక్టర్ తెలిపారు. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తామని వెల్లడించారు.
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment