మధిర బస్టాండ్‌కు మహర్దశ
మధిర: తెలంగాణ–ఏపీ కూడలిగా ఉన్న మధిర బస్టాండ్ ఆధునికీకరణకు అడుగులు పడుతున్నా యి. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఆర్టీసీ బోర్డు సమావేశంలో రూ.10 కోట్ల నిధులు కేటాయిస్తూ ఆమోదించారు. మధిర బస్ స్టేషన్ సుందరీకరణలో భాగంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ నిధులను ఆర్టీసీ మంజూరు చేసింది.
1984లో అంకురార్పణ
నియోజకవర్గ కేంద్రమైన మధిరలో బస్టాండ్ నిర్మాణానికి 1984 ఏప్రిల్ 25న నాటి సీఎం ఎన్‌టీఆర్ శంకుస్థాపన చేశారు. ఆతర్వాత బస్టాండ్ను 1990 అక్టోబర్ 26న ఆనాటి రవాణా శాఖ మంత్రి ముక్కపాటి వెంకటేశ్వరావు ప్రారంభించారు. తెలంగాణ – ఏపీ సరిహద్దులో ఉన్న మధిర నియోజకవర్గం వ్యవసాయ, వ్యాపార, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతోంది. ఇరురాష్ట్రాల నుంచి వచ్చివెళ్లే వారి రాకపోకలకుఆరు ప్లాట్‌ఫాంలతో ఉన్న బస్టాండ్ సరిపోవడం లేదు. దీంతో డిప్యూటీ సీఎం సూచనలతో రూ.10 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో ప్రస్తుతం ఉన్న బస్టాండ్‌నును పూర్తిగా తొలగించి 2.50 ఎకరాల్లో కొత్తగా నిర్మాణాలు చేపడుతారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో బస్టాండ్, మొదటి అంతస్తులో కార్యాలయ గదులతో పాటు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. ఈ నిర్మాణం పూర్తయితే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి.
ఆధునికీకరణకు రూ.10కోట్ల నిధులు
Comments
Please login to add a commentAdd a comment