![ఉన్నత స్థాయికి చేరడమే లక్ష్యం..](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/04ckm204-191047_mr-1738694935-0.jpg.webp?itok=qh-0Irwj)
ఉన్నత స్థాయికి చేరడమే లక్ష్యం..
● అందుకోసం శ్రమిస్తే విజయం ● కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మంఅర్బన్: విద్యార్థినులు జీవితంలో ఉన్నత స్థానానికి చేరడమే లక్ష్యంగా పెట్టుకుని అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగితే సాధించడం కష్టమేమీ కాదని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ తెలిపారు. ఖమ్మంలోని మహిళా ప్రాంగణం విద్యార్థినులు ఎంపీహెచ్‌డబ్ల్యూ(మల్టీ పర్పస్ హెల్త్‌వర్కర్) ఫలితాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రతిభ కనబర్చగా కలెక్టర్ మంగళవారం అభినందించారు. రాష్ట్ర స్థాయిలో మొదటి సంవత్సరం తొలి పది ర్యాంకుల్లో 1,6, 8, 10 ర్యాంకులు, రెండో సంవత్సరం విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో 2నుంచి 12వరకు ర్యాంకులు, జిల్లా స్థాయిలో మొదటి పది ర్యాంకులను మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు సాధించడం అభిందనీయమన్నారు. ఈ కోర్సు ఆధారంగా ఉన్న అవకాశాలు, ఏ రంగాల్లో ఎదగవచ్చో అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో మహిళా ప్రాంగణం మేనేజర్ విజేత, ఉద్యోగులు నాగసరస్వతి, స్పందన, హిమబిందు, మల్లిక, విజయ్‌కుమార్, సుకన్య, మౌనిక, లాలయ్య, దుర్గారావుతో పాటు ర్యాంకులు సాధించిన విద్యార్థినులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment