![డీఆర్‌డీఏ ఉద్యోగుల్లో ఆడిట్ గుబులు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/04ckm245-191048_mr-1738694935-0.jpg.webp?itok=X-DbUX8V)
డీఆర్‌డీఏ ఉద్యోగుల్లో ఆడిట్ గుబులు
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు, ఉద్యోగుల్లో ఆడిట్ గుబులు పట్టుకుంది. ఏ శాఖలోనైనా ఏడాది, రెండేళ్లకోసారి ఆడిట్ జరుగుతుంది. ఇందులో భాగంగానే గతేడాది సెప్టెంబర్ – అక్టోబర్‌లో డీఆర్‌డీఏలో ఉపాధి హామీ పథకం పనులపై జనరల్ ఆడిట్ నిర్వహించారు. అయితే జిల్లా అధికారులు, ఉద్యోగులు సరైన నివేదికలు ఇవ్వకపోవడంతో మరోసారి ఆడిట్ అధికారులు వచ్చారు. ఈమేరకు మంగళవారం టీటీడీసీ భవనంలో సమావేశమైన అధికారులు తమకు అనుమానాలు ఉన్న పనులకు సంబంధించి ఫైళ్లను పరిశీలించారు. డీఆర్‌డీఏ ఉద్యోగులతో పాటు అనుబంధంగా ఉండే పంచాయతీ, జెడ్పీ ఉద్యోగులను సైతం పిలిపించి వివరాలు సేకరించడం గమనార్హం. నాలుగు నెలల్లోనే రెండో సారి ఆడిట్ అధికారులు రావడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. జిల్లాలో ఉపాధి హామీ పనులపై పలు ఆరోపణలు రావడం, నివేదికల్లో లోపాలు ఉండడంతోనే అధికారులు మరోమారు పరిశీలనకు వచ్చినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment