జిల్లాలో ఎట్టకేలకు రీ–సర్వే షురూ
గుడ్లవల్లేరు: ఎట్టకేలకు కృష్ణాజిల్లాలో రీ–సర్వే నాలుగవ విడత కార్యక్రమాన్ని చేపట్టారు. ‘రీ–సర్వేకు చంద్ర గ్రహణం’ అనే శీర్షికన గత సోమవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఆ కథనానికి వెంటనే స్పందించిన అధికారులు రెండు రోజులుగా జిల్లాలో రీ–సర్వేను ప్రారంభించారు. జిల్లాలోని 502 రెవెన్యూ గ్రామాల్లో రీ–సర్వే గత వైఎస్సార్ సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలోని యంత్రాంగంతో మూడు విడతల్లో 308 గ్రామాల్లో చేయించారు. ఇంకా మిగిలిన 194 గ్రామాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో నాలుగవ విడత రీ–సర్వే చేపట్టారు.
నా మార్గం కమ్యూనిజం
సాక్షి అమరావతి: తన మార్గం కమ్యూనిజమని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ ఉద్ఘాటించారు. విజయవాడ విశాలాంధ్ర విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో గురువారం చంద్రం బిల్డింగ్స్‌లో లక్ష్మీనారాయణకు సన్మానం చేశారు. మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ అధ్యక్షతన జరిగిన సన్మాన సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, విశాలాంధ్ర దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కూన అజయ్‌బాబు, పి.హరినాథ్‌రెడ్డి, చావా రవి తదితరులు మాట్లాడుతూ పెనుగొండను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment