రూ.37.84 కోట్ల బకాయిలు విడుదల
గుడ్లవల్లేరు: రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించిన బూత్ లెవల్ ఆఫీసర్ల (బీఎల్‌ఓ)కు 2021–23 వరకు సంబంధించిన బకాయిలను రూ.37,84,81,500ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మంజూరు చేశారు. రాష్ట్రంలో 2021–22వరకు 13 ఉమ్మడి జిల్లాల్లో పని చేసిన 45,678మంది బీఎల్‌వోలకు రూ.10,27,75,500ను మంజూరు ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు. ఇందులో ఒక్కో బీఎల్‌వోకు రూ.2,250 చొప్పున వేతనాలు ఇచ్చారు. అలాగే 2022–23కు సంబంధించి 26 జిల్లాల్లో పని చేసిన 45,951మంది బీఎల్‌వోలకు రూ.27,57,06,000 విడుదల చేశారు. ఇందులో ఒక్కో బీఎల్‌వోకు రూ.6వేల చొప్పున ఇచ్చారు. అయితే రాష్ట్రంలో గడిచిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు రెండు రోజుల పాటు ఎన్నికల కేంద్రాల్లో పని చేసినందుకు గాను ఒక్కో బీఎల్‌వోకు రూ.1,500 చొప్పున బకాయి రావలసి ఉంది. అలాగే అదే ఏడాదికి సంబంధించిన ఒక్కో బీఎల్‌వోకు రూ.6వేల చొప్పున బకాయిలను ఎన్నికల సంఘం చెల్లించ వలసి ఉంది.
బకాయిల విడుదలకు కృషి...
బీఎల్‌వోల బకాయిల సమస్యపై రాష్ట్ర ఉప లోకాయుక్త పి.రజనీకి ఉయ్యూరుకు చెందిన యూనిటైడ్ ఫోరం ఫర్ యూఎఫ్ ఆర్‌టీఐ రాష్ట్ర కో– కన్వీనర్ జంపాన శ్రీనివాస్ గౌడ్ గతంలో నివేదించారు. అలాగే ‘సాక్షి’లో సైతం కథనం ప్రచురితమైంది. దీంతో ఎన్నికల అధికారులు స్పందించి బకాయిలు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment