ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలి
వెల్దుర్తి: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని ప్రకృతి వ్యవసాయ శాఖ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ చంద్రశేఖర్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆయన గోవర్ధనగిరి గ్రామంలో రైతు ఆనంద్ సాగు చేసిన ఏటీఎం (ఎనీటైమ్ మనీ)పంట (365 రోజుల పంట దిగుబడులు, ఆదాయం) ఏ గ్రేడ్ మోడల్‌ను పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం ఆయన సిబ్బందితో సమావేశమై రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన యూనిట్ల ప్రకారం ఈనెల 25లోపు లక్ష్యాలను సాధించాలన్నారు. ఆయన వెంట ఆశాఖ హెచ్‌ఆర్ భుజేశ్వరుడు, స్థానిక అధికారులు జనార్దన, మునిరాజు, పరమేశ్వరుడు, డిజిటల్ అసిస్టెంట్లు, ఐసీఆర్‌పీలు ఉన్నారు.
భారీగా సారా బెల్లం
స్వాధీనం
కర్నూలు: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారుల తనిఖీల్లో నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం భారీ మొత్తంలో పట్టుబడింది. కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని గుమ్మి తం తండా, ఎర్రకత్వ తండా గ్రామాల్లో ఉన్న నాటుసారా తయారీ కేంద్రాలపై ఎకై ్సజ్ అధికారులు శని వారం ఆకస్మిక దాడులు చేశారు. కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ సీఐ చంద్రహాస్, ఎస్‌ఐ నవీన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ మధుసూదన్, ఈఎస్‌టీఎఫ్ ఎస్‌ఐ ఇంద్రకిరణ్ తేజ ఆధ్వర్యంలో సిబ్బంది బృందాలుగా ఏర్పడి నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. గుమ్మితంతండా గ్రామ శివారులోని నాటుసారా కేంద్రాల్లో 2500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. అలాగే ఎర్రకత్వ తండా సమీపంలో సారాబట్టి వద్ద ఆటోలో 225 కేజీల బెల్లం, 45 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు పాతబస్తీ కవాడి వీధికి చెందిన అహ్మద్, బెల్లం వ్యాపారి రాజశేఖర్‌ను అరెస్టు చేసి నాటుసారా రవాణాదారుడు శివనాయక్ కోసం గాలిస్తున్నట్లు సీఐ చంద్రహాస్ తెలిపారు.
పుల్లగుమ్మిలో లేగదూడల ప్రదర్శన
వెల్దుర్తి: పుల్లగుమ్మి గ్రామ వెటర్నరీ ఆసుపత్రిలో శనివారం రాష్ట్రీయ గోకుల మిషన్ లేగదూడల ప్రదర్శన కార్యక్రమాన్ని డీఎల్‌డీఏ డీడీ పార్థసారథితో కలిసి పశుసంవర్ధక శాఖ జిల్లా డీడీ డాక్టర్ దుర్గా ప్రసన్న బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పశువుల యజమానులకు ఉచితంగా పాల క్యాన్‌లు, పశువుల కోసం మినరల్ మిక్చర్స్, టానిక్స్ ఇచ్చారు. అనంతరం లేగదూడల ప్రదర్శనను తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. వాటికి ఉచితంగా నట్టల నివారణ మందులు తాగించారు. కార్యక్రమంలో కల్లూరు ఏడీ డాక్టర్ పార్థసారథి, పశువైద్యాధికారులు డాక్టర్ స్వాతి, డాక్టర్ శాంతలత, డాక్టర్ చంద్రమోహన్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment