ఆటలాడుకుంటూ అనంతలోకాలకు...
● నీటి కుంటలో పడి బాలుడి మృతి
ఆస్పరి: ఆటలాడుకుంటూ నీటి కుంటలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. పుటకలమర్రి గ్రామంలో బోయ రాజు, అనిత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రాజేష్ (6) ముత్తుకూరు దగ్గర ఉన్న ఎవర్ గ్రీన్ ప్రవేట్ పాఠశాలలో రెండో తరగతి చదవుచున్నాడు. సంక్రాంతి సెలవులు రావడంతో శనివారం తల్లిదండ్రుల వెంట బాలుడు రాజేష్‌తో పాటు నలుగురు బాలురు కూడా వెళ్లారు. తల్లిదండ్రులు పొలంలో పని చేసుకుంటుండగా బాలురందరూ ఆటలాడుకుంటూ పక్క పొలంలో ఉన్న నీటి కుంట దగ్గరకు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు రాజేష్ కుంటలో పడగానే వెంట వెళ్లిన పిల్లలు తల్లిదండ్రులకు వెళ్లి విషయం చెప్పారు. వారు వెంటనే అక్కడకు వెళ్లి బాలుడిని బయటకు తీశారు. స్పృహ తప్పిపోయిన బాలుడిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు ఆదోనిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు సూచన మేరకు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment