గ్రామీణ యువకుడికి ఆర్‌బీఐలో ఉద్యోగం
కౌతాళం: మండల పరిధిలోని కామవరం గ్రామానికి చెందిన బాలాజీ అనే యువకుడు ఆర్‌బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) అసిస్టెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన యువకుడు తన విజయం గురించి చెప్పారు. కామవరం గ్రామానికి చెందిన తుమ్మల వీరారెడ్డి ఆర్‌ఎంపీగా, ఎల్‌ఐసీ ఏజెంట్‌గా విధులు నిర్వహిస్తుండగా ఆయన భార్య తుమ్మల దేవమ్మ ఇంట్లోనే చిన్నపాటి గాజులషాపు నడుపుతున్నారు. వీరి మొదటి కుమారుడు టి.బాలాజీ.. అప్లయిడ్ స్టాటిక్స్‌లో మాస్టర్ డిగ్రీని తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వావిద్యాలయం నుంచి 2020లో తీసుకున్నారు. హైదరాబాద్‌కి వెళ్లి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ మొదటి ప్రయత్నంలోనే (ఈఎస్‌ఐసీ) ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సురెన్స్ కంపెనీలో అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యో గం పొందారు. ఉద్యోగంలో చేరి వారం గడవక ముందే కర్ణాటక గ్రామీణ బ్యాంకులో ప్రోబేషనరీ ఆఫీసర్‌కు ఎంపికయ్యారు. కొన్ని రోజుల తర్వాత తెలంగాణ గ్రామీణ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగానికి కూడా ఎంపికయ్యారు. వీటిలో చేరకుండా ఆర్‌బీఐ అసిస్టెంట్ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించారు. గతేడాది సెప్టెంబర్ 23 నుంచి బెంగళూరులో ఆర్‌బీఐ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment