విమానం ల్యాండింగ్‌కు మంచు అడ్డంకి
● బెంగళూరుకు తిరిగి వెళ్లిన ఇండిగో ఫ్లైట్
కర్నూలు(సెంట్రల్): ఓర్వకల్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో బెంగళూరు నుంచి వచ్చిన ఇండిగో విమానం తిరిగి వెళ్లిపోయింది. శనివారం ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి కర్నూలుకు ఇండిగో విమానం బయలుదేరింది. అయితే 10.50 గంటలకు ఆ విమానం కర్నూలు చేరుకోగా మంచు కప్పుకొని ఉండడంతో (విజుబులిటీ) ల్యాండ్‌కు అవకాశం ఇవ్వలేదు. దీంతో తిరిగి బెంగళూరుకు వెళ్లడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. అక్కడి నుంచి బస్సులు, రైళ్లల్లో చేరుకోవాల్సి వచ్చింది. ఏటా చలికాలంలో ఓర్వకల్ ఎయిర్‌పోర్టులో ఉదయం వేళ వచ్చే విమానాల ల్యాండింగ్‌కు వాతావరణం సహకరించడం లేదు. విమానాన్ని నడిపే పైలట్‌కు ఫిజికల్ 5 కిలోమీటర్ల వరకు విజుబులిటీ ఉంటేనే ల్యాండింగ్‌కు అవకాశం ఇస్తారు. అయితే ఇక్కడ చలికాలంలో 3 కిలోమీటర్ల వరకు మాత్రమే నేరుగా పైలట్‌కు విజుబులిటీ ఉండటంతో ల్యాండింగ్ సమస్య ఎదురవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment