![కాశీకి దీటైన క్షేత్రం కాళేశ్వరం..](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/08ktm203-330114_mr-1739044516-0.jpg.webp?itok=LWcC3Hl-)
కాశీకి దీటైన క్షేత్రం కాళేశ్వరం..
● తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానందసరస్వతిస్వామి
కాళేశ్వరం: కాశీకి దీటైన క్షేత్రం కాళేశ్వరమని, కాశీలో మరణిస్తే ముక్తి..కాళేశ్వరాన్ని దర్శించుకుంటేనే ముక్తి, పుణ్యఫలం లభిస్తుందని తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానందసరస్వతిస్వామి ప్రవచనంలో తెలిపారు. శనివారం ఆయన కాళేశ్వరానికి రాగా ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు. అక్కడి నుంచి ముందు గణపతిపూజ చేసి, కాళేశ్వరముక్తీశ్వరస్వామి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. అనంతరం శ్రీశుభానందాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. కల్యాణ మండపం వద్ద ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన వేదిక వద్ద భక్తులకు ప్రవచనాలు తెలిపారు. కాళేశ్వర క్షేత్రం గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహిణి సరస్వతీనది కలిసిన మహాక్షేత్రం అన్నారు. పురాతన దేవాలయాల్లో ఒక్కటైన క్షేత్రంలో కాళేశ్వరుడు(యముడు)ని ముందు దర్శించుకొని, ఈశ్వరుడు(శివుడు)ని తర్వాత దర్శించుకుంటే ఫుణ్యఫలం చెందుతుందని పేర్కొన్నారు. మేనెలలో సరస్వతి అంతార్వాహిణి నదికి పుష్కరాలు జరుగుతాయన్నారు. మహా కుంభాభిషేకంలో చండి, సహస్ర ఘటాభిషేకం, మహారుద్రాభిషేకం నిర్వహించడం విశేషమన్నారు. అచ్చలాపురం మనోహరశర్మనును అభినందించారు. ఆర్జేసీ రామకృష్ణరావు, డీసీ సంధ్యారాణి, ఈఓ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment