● గణితం అంటే గాబరా వద్దు ● సాధన చేస్తే మ్యాథ్స్ ఈజీనే
ఏంటో ఈ తికమక లెక్కలు.. ఎప్పటికీ తప్పవా వీటి తిప్పలు అంటూ కొంతమంది విద్యార్థులు గణితమంటేనే గాబరా పడుతుంటారు. కానీ చిన్న చిన్న చిట్కాలతో చిక్కులు విప్పితే చటుక్కున చేయవచ్చు ఏ లైకె ్కనా. మనిషి జీవితంలో గణితం ఓ అంతర్భాగంగా మారిపోయింది. అందుకే విద్యార్థి దశ నుంచే గురువులు గణితంపై ఆసక్తి పెంపొందించేలా చూడాలి. శ్రీనివాస రామానుజన్ పేద కుటుంబంలో పుట్టి మేధావిగా ఎదిగారంటే ఆయనకు లెక్కల్లో అపారమైన ప్రతిభ ఉండటమే కారణం. ఆయన స్ఫూర్తితో ప్రతిఒక్కరూ గణితంలో రాణించాలని ఏటా రామానుజన్ జయంతిని జాతీయ గణిత శాస్త్ర దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. జిల్లా స్థాయిలో సైన్స్‌ఫేర్ ఏర్పాటు చేసి అందులో గణితంకు సంబంధించి ఎగ్జిబిట్లను ప్రదర్శిస్తున్నారు. నేడు నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల అభిప్రాయాలతో ప్రత్యేక కథనం.
– ఆదిలాబాద్‌టౌన్/నిర్మల్‌ఖిల్లా
గణిత బోధన చేస్తున్న ఉపాధ్యాయురాలు
Comments
Please login to add a commentAdd a comment