రాష్ట్రస్థాయి పోటీల్లోనూ రాణించాలి
మంచిర్యాలటౌన్: జిల్లాస్థాయిలో నిర్వహించిన సీఎం కప్–2024 పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ రాణించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం నిర్వహించిన సీఎం కప్ ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సీఎం కప్ పోటీల్లో గ్రామ, మండల, మున్సిపల్ స్థాయిలను దాటి జిల్లాస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 27 నుంచి జనవరి 2వరకు జరిగే పోటీల్లో రాణించి ప్రథమ స్థానమే లక్ష్యంగా కృషి చేయాలని అన్నారు. శిక్షకులతో కలిపి దాదాపు 450 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. క్రీడారంగ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోందని, గ్రామీణ స్థాయిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పాల్గొనెలా ప్రోత్సహిస్తామని తెలిపారు. అనంతరం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జూమ్ వీడియోకాల్ ద్వారా మాట్లాడుతూ ఇండోర్ స్టేడియం ఏర్పాటు, అవసరమైన క్రీడాసామగ్రి సమకూర్చడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజనుల క్రీడల శాఖ అధికారి రాజ్‌వీరు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు పోటు రవీందర్‌రెడ్డి, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తంనాయక్, జిల్లా సంక్షేమశాఖ అధికారి రౌఫ్‌ఖాన్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, ఒలింపిక్స్ సంఘం కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి, కోశాధికారి కనపర్తి రమేశ్ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జిల్లాలో ముగిసిన సీఎం కప్ పోటీలు
Comments
Please login to add a commentAdd a comment