శాంతి భద్రతలకు భంగం కలిగించొద్దు
మందమర్రిరూరల్: శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల డీసీపీ భాస్కర్‌తో కలిసి మంగళవారం మందమర్రి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కమిషనరేట్ పరిధిలో నేరాలు అదుపులో ఉన్నాయన్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలోని నేరగాళ్లపై సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వస్తే న్యాయం జరుగుతుందనే భావన ఫిర్యాదుదారుడికి కల్పించాలని సూచించారు. మందమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ అదుపులోనే ఉందని, నిందితులు ఎవరైనా సిబ్బందిని బ్లాక్‌మెయిల్ చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్క నాటి నీళ్లు పోశారు. ఆయన వెంట బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్సై రాజశేఖర్, ఏఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.
నిర్లక్ష్యం వద్దు
బెల్లంపల్లి: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని రామగుండం పోలీసు కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. క్రైమ్ రేటు తగ్గించడానికి మరింతగా కృషి చేయాలన్నారు. ఆయన వెంట మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్, వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో దేవయ్య, బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్, తాండూర్, మందమర్రి సీఐలు కుమారస్వామి, శశిధర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.
● రామగుండం సీపీ శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment