నిబంధనలు పాటిస్తే సురక్షితంగా గమ్యస్థానం | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు పాటిస్తే సురక్షితంగా గమ్యస్థానం

Published Sun, Jan 5 2025 12:22 AM | Last Updated on Sun, Jan 5 2025 12:22 AM

-

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తే సురక్షితంగా గమ్యస్థానం చేరుకుంటా రని జిల్లా రవాణా శాఖా అధికారి(డీటీఓ) సంతోశ్‌కుమార్‌ అన్నా రు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శనివారం హాజీపూర్‌ మండలం వేంపల్లి జాతీయ రహదారిపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ జిల్లాలో జీరో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంవీఐలు రంజిత్‌రెడ్డి, కిషోర్‌ చంద్రారెడ్డి, ఏఎంవీఐలు ఖాసీం, సూర్యతేజ, రవాణా శాఖ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.

చింతగూడ సెక్షన్‌ అధికారి సస్పెన్షన్‌

జన్నారం: జన్నారం అటవీ డివిజన్‌ పరిధిలోని చింతగూడ సెక్షన్‌ అధికా రి మధుకర్‌ను సస్పెండ్‌ చేస్తూ సీ ఎఫ్‌ ప్రభాకర్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు రేంజ్‌ అధికారి సు ష్మారావు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కారణంగా స స్పెండ్‌ చేసినట్లు ఆమె పేర్కొన్నా రు. కాగా చింతగూడ సెక్షన్‌ పరిధి లోని పైడిపెల్లి బీట్‌ అధికారిని కూ డా ఇటీవలే ఇదే కారణంతో సస్పెండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement