కూర్చున్న చోటు నుంచి మరో చోటుకు వెళ్లేందుకు స్మార్ట్‌ఫోన్లను ఉపయోగిస్తున్నారు. జిల్లాలో మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, రేచ్నీరోడ్ వరకు రైల్వేస్టేషన్లు ఉండగా నిత్యం వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికే లైవ్ ట్రైన్ లొకేషన్ తెలుసుకునే యాప్‌లను విరివిగా వాడుతున్నారు. రైల్వే శాఖ సంబంధించిన అధికారిక యాప్‌లతో పాటు ప్రైవేటు యాప్‌ల సాయంతో ట్రైన్ ఎక్కడుందో తెలుసుకుంటున్నారు. అలస్యం, ముందు టైం ప్రకారం స్టేషన్‌కు చేరుకుంటున్నారు. ఇక రిజర్వేషన్‌తో పాటు జనరల్ టికెట్లు తీసుకునే అవకాశం ఉండడంతో సెల్‌ఫోన్‌లోనే టికెట్ చూపించి రైళ్లు, బస్సుల్లో ప్రయాణం చేసే సౌకర్యం కలిగింది. టీజీఆర్టీసీ సైతం ఇలాంటి సదుపాయాలు అందుబాటులోకి తెచ్చింది. లగ్జరీ, సూపర్ లగ్జరీ, ఇంద్ర, లహరీ బస్సుల్లో నేరుగా యాప్‌తో చెల్లించే సదుపాయాలు వచ్చాయి. ఇవే కాకుండా ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు, షేరింగ్ వాహనాల సౌకర్యం ఇచ్చే యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment