విపరీతంగా ఫుడ్ ఆర్డర్లు
ఇంట్లో వంట చేయడం కుదరని పక్షంలో చాలా మంది ఫుడ్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తూ ఆరగించేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో ప్రముఖ కంపెనీలు తమ సేవలు ప్రారంభించాయి. దీంతో నిమిషాల్లో భోజనం ఇంటికి చేరుతోంది. ఎంపిక చేసుకున్న హోటళ్ళు, రెస్టారెంట్ల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. వారాంతాలు, సెలవు దినాలు, పండుగలు, పర్వదినాల్లో ఇలాంటివి ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ఇక పుట్టినరోజు, పెళ్ళి రోజులు వంటి సందర్భాల్లోనూ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. పట్టణ శివారు ప్రాంతాల దాక డెలివరీ బాయ్స్ సేవలు ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment