చివరి ఆయకట్టు వరకూ సాగునీరు
● కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: యాసంగిలో గూడెం ఎత్తిపోతల పథకం చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందించేందు కు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నా రు. శనివారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, చీఫ్ ఇంజినీర్ బ ద్రినారాయణ, డీఈ దశరథంతో కలిసి రైతు సంఘాల ప్ర తినిధులు, రైతులతో యాసంగిలో సాగునీటి విడుదలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ నీటి విడుదలలో సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు నీటివృథాను అరికట్టాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం సాగునీటిని విడుదల చేసేందుకు కార్యాచరణ రూ పొందించాలన్నారు. యాసంగిలో గూడెం ఎత్తిపోతల పథ కం కింద 69 వేల ఎకరాల ఆయకట్టు సాగవుతోందన్నారు. దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల పరిఽధిలో రెండున్నర రోజులు, హాజీపూర్ మండల పరిధిలో రెండు రోజుల చొప్పున ఈ నెల 5 నుంచి ఏప్రిల్ 25 వరకు నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏఈఈలు జాకీర్, రాజేందర్, కీర్తి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment