‘వివేక’మే స్ఫూర్తి పథం కావాలి
మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: స్వామి వివేకానంద స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని, ఆయన ఆశయాల ను కొనసాగించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... స్వామి వివేకానంద తన ప్రసంగాలతో భారత జాతిని మేల్కొలిపినట్లు పేర్కొన్నారు. యువత రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మోసం, హామీల వైఫల్యం గూర్చి ప్రజల్లో చైతన్యం తేవాలని సూచించారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, కేసీఆర్ పథకాలను బంద్ చేసిందని ప్రజలకు అర్థం అయ్యేలా వివరించాలని సూచించారు. పదేళ్లు సిద్దిపేట అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు సాగిందని అన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు. రాబోయే రోజుల్లో యువతకు సముచిత స్థానం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా వెంకటాపుర్ బీరప్ప దేవాలయం నిర్మాణానికి హరీశ్‌రావు లక్ష రూపాయల విరాళం అందించారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, మార్కెట్ కమిటీ మాజి చైర్మన్ సాయిరాం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment