సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ నేడు (డిసెంబర్ 12) 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే.. సినీరంగం నుంచి ప్రముఖులంతా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు హీరో ధనుష్ బర్త్ డే విషెస్ తెలపడం అందరినీ ఆకట్టుకుంటోంది. కోలీవుడ్‌లో స్టార్ హీరోగా కొనసాగుతున్న ధనుష్.. తలైవా రజనీకాంత్‌కు అల్లుడే అని తెలిసిందే. కానీ ఐశ్వర్యతో కొన్ని విభేదాలు రావడంతో ఆమె నుంచి దూరంగా ఉంటున్నాడు. కానీ రజనీకాంత్‌పై ధనుష్‌కు ఉన్న గౌరవం,ప్రేమను ఇలా సందర్భాన్ని బట్టి చూపిస్తుంటాడు.
ధనుష్ శుభాకాంక్షలు
రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా నటుడు ధనుష్ తన ఎక్స్ పేజీలో "హ్యాపీ బర్త్ డే తలైవా" అని రాశారు. అలాగే, రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్‌లో HBD సూపర్ స్టార్ రజనీకాంత్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. గతంలో జైలర్ సినిమా విడుదలైన సమయంలో కూడా ధనుష్ రియాక్ట్ అయ్యాడు. ఈ వారం అంతా జైలర్‌దే అంటూ ట్వీట్ చేశాడు. ధనుష్ శుభాకాంక్షలను చూసిన అభిమానులు వారి మధ్య ఎన్ని సమస్యలు వచ్చినా రజనీపై ధనుష్ అభిమానం తగ్గలేదని వ్యాఖ్యానిస్తున్నారు.
నేడు టైటిల్ టీజర్
రజనీకాంత్ 170 వ సినిమా టైటిల్ టీజర్‌ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్టు వారు ప్రకటించారు. రజనీ పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా ఆయన అభిమానులు కూ అన్నదానం చేయడం గమనార్హం.
Happy birthday Thalaiva @rajinikanth 🙏🙏🙏🙏♥️♥️♥️
— Dhanush (@dhanushkraja) December 12, 2023
Comments
Please login to add a commentAdd a comment