ఊహించని గిఫ్ట్‌.. అల్లు అర్జున్‌ రియాక్షన్‌ ఇదే! | Allu Arjun Receives Special Gift From Unknown Person | Sakshi
Sakshi News home page

Allu Arjun: అరుదైన గిఫ్ట్‌.. బన్నీ ఫుల్‌ హ్యాపీ

Published Sun, Sep 15 2024 6:16 PM | Last Updated on Sun, Sep 15 2024 6:16 PM

Allu Arjun Receives Special Gift From Unknown Person

పుష్ప సినిమాతో వసూళ్లు సునామీ సృష్టించాడు అల్లు అర్జున్‌. ఇప్పుడదే సినిమా సీక్వెల్‌తో మరోసారి అదరగొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీ డిసెంబర్‌ 6న వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇకపోతే బన్నీకి ఓ అభిమాని నుంచి ఊహించని బహుమతి వచ్చిందట.

నన్ను కదిలించేసింది
అదేంటంటే.. సీ.కే. ఒబెరాన్‌ రాసిన బర్న్‌డ్‌ బెనీత్‌ ద ఫైర్‌ అండ్‌ డిజైర్‌ (Burned Beneath the Fire of Desire). ఈ పుస్తకాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పంపించాడని అల్లు అర్జున్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో వెల్లడించాడు. నాకు ఈ గిఫ్ట్‌ పంపించిన వ్యక్తి నిజాయితీ నన్ను కదిలించేసింది. పుస్తకప్రియుడిగా ఈ పుస్తక రచయిత, జెంటిల్‌మెన్‌ సీ.కే. ఒబెరాన్‌కు ఆల్‌ ద బెస్ట్‌ చెబుతున్నాను అని రాసుకొచ్చాడు.

పుష్ప 2..
పుష్ప 2 విషయానికి వస్తే సుకుమార్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రానికి మరోసారి రాక్‌స్టార్‌ దేవి శ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. సునీల్‌, ప్రకాశ్‌ రాజ్‌, ఫహద్‌ ఫాజిల్‌, అనసూయ, రావు రమేశ్‌, ధనంజయ షణ్ముఖ్‌, అజయ్‌, జగదీష్‌ ప్రతాప్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది.

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement