బిగ్‌బాస్‌ షోలో షాకింగ్‌ ఘటన, కత్తితో ఆత్మహత్యాయత్నం! | Bigg Boss 15: Afsana Khan Tries To Cut Herself With Knife, Deets Inside | Sakshi
Sakshi News home page

Bigg Boss: బిగ్‌బాస్‌ షోలో షాకింగ్‌ ఘటన, కంటెస్టెంట్‌ సూసైడ్‌ అటెంప్ట్‌!

Published Wed, Nov 10 2021 5:55 PM | Last Updated on Wed, Nov 10 2021 6:45 PM

Bigg Boss 15: Afsana Khan Tries To Cut Herself With Knife, Deets Inside - Sakshi

హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌లో అపశృతి చోటు చేసుకుంది. టాస్క్‌లో ఓడిపోయినందుకు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అఫ్సానా ఖాన్‌ ఆత్మహత్యకు యత్నించింది. దీంతో ఇతర హౌస్‌మేట్స్‌ షాక్‌ తిన్నారు. వివరాల్లోకి వెళితే..  ప్రస్తుతం హౌస్‌ కెప్టెన్‌గా కొనసాగుతున్న ఉమర్‌ రియాజ్‌.. కరణ్‌ కుంద్రా, నిషాంత్‌ భట్‌, తేజస్వి ప్రకాశ్‌, అఫ్సానా ఖాన్‌లలో ముగ్గురిని మాత్రమే వీఐపీ టికెట్‌ కోసం ఎంచుకోవాల్సి ఉంటుంది.

అయితే రియాజ్‌.. అఫ్సానా ఖాన్‌ను ఈ రేసు నుంచి తప్పించి మిగిలిన ముగ్గురిని సెలక్ట్‌ చేశాడు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన అఫ్సానా.. అందరూ తనను టార్గెట్‌ చేస్తున్నారని, నమ్మిన స్నేహితులే వెన్నుపోటు పొడుస్తున్నారని ఆవేశపడింది. వెంటనే అక్కడున్న ఓ కత్తిని అందుకుని తనను తాను గాయపర్చుకునేందుకు ప్రయత్నించింది. అప్రమత్తమైన రియాజ్‌, కరణ్‌ ఆమెను అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

కాగా అఫ్సానా ఖాన్‌ బిగ్‌బాస్‌ షోలో గొడవలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఆమె చేసిన తప్పుల వల్ల కొన్నిసార్లు హౌస్‌మేట్స్‌ అంతా శిక్షను అనుభవించాల్సి వచ్చింది. ఆమె తీరు మార్చుకోవాలని పలువురు కంటెస్టెంట్లు నచ్చజెప్పాలని చూసినప్పటికీ అఫ్సానా ఎవరి మాటా వినిపించుకునేది కాదు. పైగా శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టితో తరచూ గొడవలు పడుతూ మరింత వ్యతిరేకత మూటగట్టుకుంటోంది. 

చదవండి:

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement