విలక్షణ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం 'దారి'. ఈ సినిమాలో పరమేశ్వర్ హివ్రాలే, కళ్యాణ్ విట్టపు, సునీత సద్గురు, సాయి తేజ గోనుగుంట్ల, అభిరామ్ (క్రేజీ అభి) ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుహాష్ బాబు దర్శకత్వం వహించగా.. నరేష్ మామిళ్ళపల్లి, మోహన్ ముత్తిరయిల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విభిన్నమైన స్టోరీతో ఫిఫ్త్ హౌస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్లు విడుదల చేశారు. ఇదివరకే విడుదలైన దారి సినిమా కాన్సెప్ట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.
(చదవండి: సుధీర్ బాబు 'హంట్' అప్‌డేట్.. టీజర్ రిలీజ్ ఆరోజే..!)
తాజా ట్రైలర్‌లో ‘భూ ప్రపంచంలో ప్రతీ జీవికి ఏదో ఒక సమస్య.. అలానే ఈ కథలో కూడా.. మా సమస్యకి.. కొలతలు లేవుగానీ రూపం మాత్రం ఉంది.. సమస్యను పట్టుకోవాలని ఒకరు.. సమస్యను తీర్చాలని ఇంకొకరు.. సమస్యను వెతుక్కుంటూ వెళ్లేది ఇంకొకరు.. సమస్యను తికమక పెట్టేది మరొకరు.. మా అందరి సమస్య ఒక్కటే.. పారిపోవడం, దాక్కోవడం లేదా ఎదురుతిరగడం.. మా సమస్య తీరిందో లేదో తెలియాలంటే.. మేం ఏ దారిలో వెళ్లామో తెలియాలి.. అది తెలియాలంటే మీరు మా దారికి రావాలి.. ఒకటి గుర్తు పెట్టుకోండి.. మీ సమస్యను తీర్చడానికి ఎవ్వరూ రారు.. ఆఖరికి దేవుడు కూడా’ అంటూ సాగే డైలాగ్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment