చిరంజీవితో ఆడిపాడిన హీరోయిన్‌.. ఎవరో తెలుసా? | Guess The Kodama Simham Actress In This Viral Photo | Sakshi
Sakshi News home page

ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? తెలుగు సినిమాతోనే కెరీర్‌ ఆరంభం.. వయసు 51 ఏళ్లు!

Published Mon, Jul 1 2024 5:44 PM | Last Updated on Mon, Jul 1 2024 5:59 PM

Guess The Kodama Simham Actress In This Viral Photo

ఈ ఫోటోలో కనిపిస్తున్న సీనియర్‌ హీరోయిన్‌ వయసు 51 ఏళ్లు. హాఫ్‌ సెంచరీ కొట్టినా సరే గ్లామర్‌ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా సోషల్‌ మీడియాలో ఫోటోలు వదులుతోంది. 90'స్‌లో తన అందంతో యూత్‌ను మైమరిపించిన ఈ నటి పేరు సోనమ్‌ ఖాన్‌. ఈమె నట ప్రస్థానం మొదలైంది తెలుగు సినిమాతోనే! 

హిందీలో వరుస ఆఫర్లు
రమేశ్‌బాబు 'సామ్రాట్‌' మూవీలో హీరోయిన్‌గా నటించింది. అయితే వరుస ఆఫర్లు, క్రేజ్‌ అందుకుంది మాత్రం బాలీవుడ్‌లోనే! హిందీలో.. త్రిదేవ్‌, మిట్టి ఔర్‌ సోనా, అజూబ, క్రోధ్‌, విశ్వాత్మ వంటి చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఈమె ఒక సెన్సేషన్‌.. తనకు త్రిదేవ్‌, విశ్వాత్మ వంటి హిట్‌ సినిమాలిచ్చిన డైరెక్టర్‌ రాజీవ్‌ రాయ్‌ను పెళ్లాడింది. వివాహం తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పింది. వీరికి ఓ బాబు పుట్టాడు. 

కొడుకే ప్రాణంగా..
అతడికి నాలుగేళ్ల వయసు వచ్చేసరికి ఆటిజం ఉన్నట్లు తేలింది. దీంతో అతడిని వెంటేసుకుని ఎప్పుడూ ఆస్పత్రుల చుట్టూ తిరిగేది. కుమారుడే ప్రాణంగా బతుకుతోంది. 2016లో సోనమ్‌ దంపతులు విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి తన కుమారుడికి తండ్రి కూడా తానే అయింది. ఇకపోతే సోనమ్‌ ఖాన్‌ తెలుగులో ముగ్గురు కొడుకులు, కొదమ సింహం చిత్రాల్లో నటించింది. 30 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె ఇన్నాళ్లకు ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అందుకోసమే ఇలా సరికొత్తగా ముస్తాబవుతోంది.

 

 

 

చదవండి: అందరికంటే ముందుగా మీరే 'కల్కి'ని ఆదరించారు: నాగ్‌ అశ్విన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement