RRR Movie: కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ ‘రౌద్రం... రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్). దాదాపు 14 భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుంచి శుక్రవారం సాయంత్రం 'కొమురం భీముడో.. కొమురం భీముడో..' సాంగ్ రిలీజైంది. గోండు బెబ్బులి కొమురం భీమ్ ధైర్యసాహసాలను చాటిచెప్తూ అద్భుతమైన లిరిక్స్ అందించాడు సుద్దాల అశోక్ తేజ. సింగర్ కాలభైరవ గాత్రంతో ఈ పాట మరో లెవల్‌కు వెళ్లిపోయింది. 'కొమురం భీముడో.. కొమురం భీముడో.. కొర్రా సూనెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో..' అంటూ సాగే ఈ పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయంటున్నారు సినీప్రియులు.
ఈ మూవీ కోసం ఎంతగానో కష్టపడ్డ ఎన్టీఆర్, రామ్‌చరణ్ దక్షిణాది భాషల్లో ఒక్క మలయాళం తప్ప తెలుగు, తమిళ, కన్నడంలో తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకున్నారు. అలాగే హిందీలో కూడా సొంత వాయిస్‌నే వినిపించనుండటం విశేషం. ఇక బాహుబలి తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాను డీవీవీ దానయ్య నిర్మించాడు.
Comments
Please login to add a commentAdd a comment