Actor Vishal Reveals About His Love, Says Soon Will Reveal Her Name - Sakshi
Sakshi News home page

Actor Vishal Love: నిశ్చితార్థం బ్రేక్‌ అయ్యాక ప్రేమలో పడ్డ విశాల్

Published Thu, Jul 7 2022 6:49 PM | Last Updated on Thu, Jul 7 2022 7:45 PM

Vishal Reveals He is In Already Love - Sakshi

సన్నివేశాలు సహజంగా ఉండటం కోసం యాక్షన్‌ సీన్లలో డూప్‌ లేకుండా నటిస్తుంటాడు హీరో విశాల్‌. ఈ క్రమంలో ఎన్నోసార్లు గాయాలపాలైనా సరే ఫైట్‌ సన్నివేశాల కోసం రిస్క్‌ చేయడం మాత్రం మానడు. ఇటీవలే లాఠీ సినిమా షూటింగ్‌లో గాయపడిన విశాల్‌ ఇప్పుడిప్పుడే గాయాల నుంచి కోలుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే నడిగర్‌ సంఘానికి భవనం కట్టించాకే పెళ్లి చేసుకుంటానని శపథం చేసిన విశాల్‌ ప్రస్తుతం ప్రేమలో ఉన్నాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు.. పెద్దలు కుదిర్చిన సంబంధాలు తనకు అచ్చిరావని, కాబట్టి లవ్‌ మ్యారేజే చేసుకుంటానని చెప్పాడు. అంతేకాదు, ప్రస్తుతం ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నానని, త్వరలోనే ఆమె ఎవరనే విషయాన్ని బయటపెడ్తానని పేర్కొన్నాడు. మరి ఆమె ఎవరనేది తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే!

ఇకపోతే విశాల్‌కు 2019లో నటి అనీషా అల్లారెడ్డితో నిశ్చితార్థం జరిగింది. ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకునేలోపు వారు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత విశాల్‌ వరలక్ష్మి శరత్‌కుమార్‌తో లవ్‌లో ఉన్నాడంటూ రూమర్‌ బయలుదేరగా అది వట్టి పుకారుగానే మిగిలిపోయింది.

చదవండి: దటీజ్‌ రామ్‌చరణ్‌, కమెడియన్‌ను సొంత విమానంలో తీసుకొచ్చి
ప్రముఖ దర్శక-నిర్మాత రాజేంద్రప్రసాద్‌ మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement