చట్ట ప్రకారం దత్తత తీసుకోవాలి
● డీడబ్ల్యూఓ శిరీష
ములుగు: పిల్లల దత్తతను చట్ట ప్రకారం తీసుకోవాలని డీడబ్ల్యూఓ కూచన శిరీష సూచించారు. జిల్లా కేంద్రంలోని బాలరక్ష భవన్‌లో మంగళవారం పిల్లలను దత్తత తీసుకోవడానికి దరఖాస్తు చేసుకున్న వారితో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో శిరీష తగిన సూచనలు చేశారు. తల్లిదండ్రులు చిన్నారులను పోషించలేక బాధాకరమైన సందర్భాల్లో విడిచిపెట్టి వెళ్తుంటారని తెలిపారు. వారిని శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేరదీసి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి నిబంధనల మేరకు పిల్లలను అప్పగిస్తామని వివరించారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ, కృష్ణవేణి, సంజీవ, రజని, స్వప్న, రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment