వినూతనంగా ముందుకు..
సాక్షి, నాగర్‌కర్నూల్: కొత్త సంవత్సరంలో వినూత్న మార్పులు తీసుకురావాలని భావిస్తున్నాం. ప్రధానంగా వృత్తి జీవితానికి మరింత ఉపయుక్తంగా ఉండేలా ప్రాక్టికల్ జ్ఞానాన్ని పెంచుకుంటాం. సెల్‌ఫోన్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించుకుంటాం. పూర్తిగా చదువు, విజ్ఞానంపై దృష్టిపెడతాం. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించడంతోపాటు తల్లిదండ్రులతో గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తాం.’ ఇది నూతన సంవత్సరం సంవత్సరం సందర్భంగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులు తీసుకున్న నిర్ణయాలు. 2025 కొత్త ఏడాదిలో తీసుకోనున్న నిర్ణయాలపై మెడికల్ కళాశాల విద్యార్థులతో ‘సాక్షి’ టాక్‌షో నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు మెడికోలు వెల్లడించిన అభిప్రాయాలు వారి మాటల్లోనే..
మార్పుల కోసం కఠిన
నిర్ణయాలు తీసుకుంటాం
● సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండేందుకు ప్రయత్నం
● వృత్తి జీవితానికి సంబంధించిన అంశాలపై ప్రధానంగా దృష్టి
● ఆరోగ్యం మెరుగు, తల్లిదండ్రులతో గడిపేందుకు ప్రాధాన్యం
● ‘సాక్షి’ డిబేట్‌లో ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల మనోగతం
Comments
Please login to add a commentAdd a comment