నల్లగొండ : ఎగుమతులకు అనువైన ఉత్పత్తులపై జిల్లా రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎగుమతుల విధానంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎగుమతులకు అనువైన ఉత్పత్తులు, క్లస్టర్ల అభివృద్ధికి కావాల్సిన పరిస్థితులను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో స్వయం సహాయక మహిళా సంఘాలను ప్రోత్సహిస్తామని.. అవసరమైన భూమిని తక్కువ రేటుకు ఇస్తామని తెలిపారు. ఎఫ్‌ఐఈఓ కులకర్ణి మాట్లాడుతూ ఎగుమతులకు అనువైన పరిశ్రమల ఏర్పాటు, వాటి విధానంపై వివరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌కుమార్, హార్టికల్చర్ డీడీ సాయిబాబా, వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, స్వయం సహాయక మహిళా సంఘాల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
పండుగ వాతావరణంలో డైట్ చార్జీల పెంపు..
ప్రభుత్వ వసతిగృహాల్లో చదివే విద్యార్థుల మెస్ చార్జీల పెంపు ప్రారంభ కార్యక్రమాన్ని ఈనెల 14వ తేదీన పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించి సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లలో మెస్చార్జీల పెంపు కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులను ఆహ్వానించాలని పేర్కొన్నారు. డైట్ చార్జిల వివరాలను ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ కోటేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ పీడీ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రాజ్‌కుమార్ హాజరయ్యారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment