నకిరేకల్ మార్కెట్ చైర్‌పర్సన్‌గా గుత్తా మంజుల
నకిరేకల్ : నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ చైర్‌పర్సన్‌గా కేతేపల్లి మాజీ ఎంపీపీ గుత్తా మంజుల మాధవరెడ్డి నియామకం అయ్యారు. వైస్ చైర్మన్‌గా దూలం సోమయ్య(ఓగోడు), డైరెక్టర్లుగా బొల్లెద్దు లక్ష్మయ్య(మంగళపల్లి), మొగిలి బుచ్చయ్య(తాటికల్), బయ్య ముత్తయ్య(కేతేపల్లి), మాందాసు పరశరాములు, ఎస్‌కే.లతీఫ్(గుడివాడ), వరకాంతం శేఖర్‌రెడ్డి(నోముల), గుండు పరమేష్(కట్టంగూర్), పుట్ట నర్సింహారెడ్డి(కలిమెర), కిష్ణయ్య(పామనగుండ్ల), కప్పల సైదులు(కొప్పోలు), వ్యాపార ప్రతినిధులుగా గజ్జల వెంకటేశ్వర్లు(నకిరేకల్), తోనుపునూరి రాంబాబు(నకిరేకల్), వీరితో పాటు నకిరేకల్ పీఏసీఎస్ చైర్మన్, నకిరేకల్ మున్సిపల్ చైర్‌పర్సన్ చైర్‌పర్సన్, మార్కెంటింగ్ శాఖ జిల్లా అధికారి, స్థానిక వ్యవసాయశాఖ ఏడీలు డైరెక్టర్లుగా నియమితులయ్యారు. నూతనంగా చైర్‌పర్సన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, గురువారం నకిరేకల్‌లో ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment