జోసఫ్ రోమానో సేవలు మరువలేనివి
కేతేపల్లి: బడుగుల అభ్యున్నతికి దివంగత ఫాదర్ జోసఫ్ రోమానో చేసిన సేవలు మరువలేనివని క్రైస్తవ మత జిల్లా పీఠాధిపతి (బిషఫ్) ధమన్‌కుమార్ అన్నారు. కేతేపల్లి మండలం రాయపురం గ్రామంలో గల సెయింట్ పీటర్స్ చర్చి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జోసఫ్ రొమానో శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన రొమానో విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేసి మాట్లాడారు. చర్చి విచారణ గురువు టి.బాలశౌరి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో క్రైస్తవ మత గురవులు పి.అలెగ్జాండర్, బాలశౌరి, ఎం.తానయ్య, గ్రామపెద్దలు బొజ్జ లూర్ధు, బంద బాలస్వామి, మాదాను సబ్‌స్టేన్, కాల రాజా, పసల ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.
ఫ క్రైస్తవ మత పీఠాధిపతి ధమన్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment