వైద్యులు చిత్తశుద్ధితో పనిచేయాలి
మర్రిగూడ : వైద్యులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సూచించారు. మర్రిగూడ మండల కేంద్రంలోని సీహెచ్‌సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్)లో రూ.70 లక్షలతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మర్రిగూడ సీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం రోగులకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. మర్రిగూడ మండల సమీప గ్రామాల కిడ్నీ రోగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. రోగుల సంఖ్యను బట్టి 24గంటలు డయాలసిస్ కేంద్రం పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్‌ఎస్ మాతృ, సూపరింటెండెంట్ శంకర్‌నాయక్ పాల్గొన్నారు.
ప్రజలకు ఉత్తమ సేవలందించాలి
ఫ ఎస్పీ శరత్ చంద్ర పవార్
హాలియా : పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉత్తమ సేవలు అందించాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం ఆయన హాలియా పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది పనితీరు, స్థితిగతుల గురించి ఎస్‌ఐ సతీష్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ మేనేజ్‌మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాకప్, ఎస్‌హెచ్‌ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాల్లో సీసీటీవీల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదాల నివారణకు రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలన్నారు. ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి.. సత్వర న్యాయం జరిగేలా పని చేయాలన్నారు. ఎస్పీ వెంట మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు, హాలియా సీఐ జనార్దన్‌గౌడ్, ఎస్‌ఐ సతీష్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఉత్తమ మహిళా రైతు అవార్డు అందజేత
చిట్యాల : మండలంలోని ఉరుమడ్ల గ్రామానికి చెందిన మహిళ రైతు పొలగోని వెంకటమ్మ జిల్లాస్థాయి ఉత్తమ మహిళా రైతుగా ఎంపికయ్యారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెంకటమ్మకు ఉత్తమ మహిళ రైతు అవార్డును అందజేశారు. వెంకటమ్మ 30 ఏళ్లుగా ఉరుమడ్ల గ్రామంలో తనకున్న పదమూడు ఎకరాల్లో కూరగాయాలు, వరి, పత్తితో పాటు పలు రకాల పండ్లను పండిస్తున్నారు. అవార్డు అందుకున్న వెంకటమ్మను పలువురు అభినందించారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
త్రిపురారం : ప్రభుత్వ భవనాల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని పంచాయతీ రాజ్ ఎస్‌ఈ ప్రకాశ్ అన్నారు. శుక్రవారం నిడమనూరు మండల కేందంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. నెల రోజుల్లో ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈ ఆంజనేయులు, కాంట్రాక్టర్ జితేందర్ రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment