నేరాలు..ఘోరాలు
● 2024లో 46 హత్య కేసులు ● దళితులకు తప్పని అవమానాలు ● దొంగల చేతివాటమూ అధికమే! ● సైబర్ నేరాల్లో రికవరీ సున్నా..
బొమ్మలసత్రం: నంద్యాల జిల్లాలో నేరాలు ఘోరాలు 2024లో అధికంగా నమోదయ్యాయి. జిల్లాగా ఏర్పాటైనప్పుడున్న జిల్లా ఎస్పీ కె రఘువీర్‌రెడ్డి 2024 జులైలో బదిలీ కాగా అధిరాజ్‌సింగ్‌రాణా అదేనెల 15న ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. మంగళవారం నాటితో 2024 సంవత్సరం ముగియనుండటంతో పోలీస్‌శాఖ జిల్లా వార్షిక నివేదికను విడుదల చేసింది. 2023తో పోలీస్తే 2024లో హత్యలు, సైబర్ నేరాలు, దొంగతనాలు ఎక్కువగానే జరిగాయి. నాటుసారా, అక్రమ మద్యం తరలింపు కేసులు కూడా అధికంగానే నమోదయ్యాయి.
హత్యలు..
జిల్లాలో 2024లో 46 హత్యలు జరిగాయి. అలాగే 6 దోపిడీ, 346 చోరీలు నమోదయ్యాయి. 28 హత్యాయత్నం కేసులతోపాటు మట్కా, గంజాయి కేసులు కూడా ఎక్కువగానే నమోదయ్యాయి.
సైబర్ కేటుగాళ్లదే పైచేయి
2024లో సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా దోచుకు న్నారు. జిల్లా కేంద్రంలో ఒక డాక్టర్‌ను డిజిటల్ అరెస్ట్ పేరుతో బురిడీ కొట్టించి ఏకంగా రూ.38 లక్షలు కాజేశారు. నకిలీ సంస్థల పేరుతో బిట్ కాయిన్స్ విక్రయించి ఒకరి నుంచి రూ.1కోటిగా పైగా కేటుగాళ్లు సొమ్ముచేసుకున్నారు. ఒక ఉపాధ్యాయుడు ఈఏడాది నకిలీ సంస్థను నమ్మి పెట్టుబడి పెట్టి రూ.8 లక్షలకు పైగా మోసపోయి చివరికి ఆత్మహత్యకు పాల్పడటం విచారకరం. జిల్లా వ్యా ప్తంగా మొత్త 56 సైబర్ కేసులు నమోదయ్యాయి. కాగా రూపాయి కూడా రికవరీ కాలేదు.
మట్కా భూతం
జిల్లాలో 2024లో మట్కా బాబులు వారి వ్యాపారాన్ని మరింత విస్తరింపజేశారు. 73 మట్కా కేసులకు గాను రూ.1,96,0052 నగను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈసంఖ్యను చూస్తే మట్కా జిల్లా వ్యాప్తంగా కోరలు చాచుస్తుందో ఇట్టే అర్థమవుతుంది.
రక్తమోడినహదారులు
2024లో అతివేగం, మద్యం తాగి, నింధనలకు విరుద్ధంగా వాహనాలను నడపటం వల్ల 633 ప్రమాదాలు సంభవించాయి. వాటిలో తీవ్రమైన ప్రమాదాలు 61 నమోదయ్యాయి. 2023తో పోలీస్తే ప్రమాదాల సంఖ్య కాస్త తగ్గింది. బ్లాక్‌స్పాట్‌ల గుర్తింపు, ప్రమాదాల సూచికల ఏర్పాటు తదితర చర్యల వల్ల ప్రమాదాల సంఖ్య పెరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.
జిల్లాలో నమోదైన నేరాల వివరాలు
2023 నేరం 2024
34 హత్యలు 46
0 దోపిడీలు 6
312 దొంగతనాలు 346
129 ఎస్సీ, ఎస్టీ కేసులు 135
29 సైబర్ నేరాలు 56
3 అత్యాచారాలు 3
601 అక్రమ మద్యం కేసులు 1457
Comments
Please login to add a commentAdd a comment