కార్పొరేషన్‌గా మహబూబ్‌నగర్
మున్సిపాలిటీలుగా మద్దూరు, దేవరకద్ర
ఇదిలా ఉండగా ఆయా గ్రామాల్లో ఇక ఆస్తిపన్ను, నల్లా బిల్లులు, భవన నిర్మాణ అనుమతికి చెందిన చార్జీలు పెరుగుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంతవరకు ఈ గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కొనసాగుతుండగా.. ఇక నుంచి ఇది అమలు కాదని తెలుసుకున్న వారు ఏమి చేయాలోనని తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు గతంలోనే సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసినందున ఇదే అదనుగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. ఒకవేళ సర్పంచ్‌ల పదవీకాలం కొనసాగి ఉంటే ఎక్కడికక్కడ గ్రామసభలు ఏర్పాటు చేసి మున్సిపాలిటీలుగా మార్చవద్దని తీర్మానాలు చేసేవారు.
అసెంబ్లీ ఎన్నికలు ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మద్దూరు గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. మద్దూరు అనుబంధ గ్రామాలుగా ఉన్న భీంపూర్, నాగంపల్లి, సాపన్‌చెరవుతండాతో పాటు రెనివట్ల, వాల్యానాయక్‌తండా, అంబటోనివంపులను కూడా పురపాలికలో విలీనం చేశారు. 2023 లెక్కల ప్రకారం వీటన్నింటిలో కలిపి 12,595 మంది ఓటర్లు ఉన్నారు. నారాయణపేట జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య నాలుగుకు చేరింది.
ఎన్నికల హామీమేరకు మున్సిపాలిటీగా..
పన్నులు పెరుగుతాయని ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment