జైపూర్: ఆ ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. అంతలో ఊహించని షాక్ ఎదురైంది. చనిపోయాడని అనుకున్న ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి.. 33 ఏళ్ల తర్వాత కనిపించాడు. దీంతో అతనిని చూసి ఆ కుటుంబం షాక్‌తో పాటు పట్టరాని ఆనందంలో మునిగిపోయింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో చోటు చేసుకుంది. అసలే కథేంటంటే.. హనుమాన్ సైనీ 33 ఏళ్ల కిందట ఢిల్లీలోని ఖారీ బావోలిలో పని చేశాడు. అయితే 1989లో హఠాత్తుగా అదృశ్యమయ్యాడు.
అతడిని వెతికేందుకు కుటుంబ సభ్యులు అన్ని ప్రయత్నాలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన లాభం లేకుండా పోయింది. చివరికి సైనీ చనిపోయి ఉంటాడని భావించారు. ఈ నేపథ్యంలో 2022లో సైనీకి కర్మ కాండలు నిర్వహించారు. సైనీ ఇన్నేళ్ల తర్వాత ఇంటికి రావడం ఆ కుటుంబాన్ని సంతోషంలో ముంచేసింది. ఇదిలా ఉండగా ఈ అరుదైన కలయికను చూసేందుకు గ్రామంలోని నివాసితులు సైనీ కుటుంబం ఇంటి వద్ద కిక్కిరిసిపోయారు.
ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నాడంటే..
33 ఏళ్ల అతను హిమాచల్ ప్రదేశ్‌లో గత మూడు దశాబ్దాలుగా ఎక్కడ ఉన్నాడో వివరించాడు. దేవత పిలుపు మేరకు హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా మాత ఆలయానికి వెళ్లేందుకు తన స్వస్థలాన్ని విడిచిపెట్టాడు. ఇంటి నుంచి బయటవెళ్లే సమయంలో తన వద్ద కేవలం రూ. 20 మాత్రమే ఉందని తెలిపాడు. ఆ డబ్బులతోనే రైలులో ప్రయాణిస్తుంటే....టీటీ తన పరిస్థితి చూసి దయ చూపడంతో పఠాన్‌కోట్ వరకు ఉచితంగా ప్రయాణించినట్లు తెలిపాడు.
అక్కడ నుంచి తాను హిమాచల్‌లోని కాంగ్రా మాత ఆలయానికి చేరుకుని 33 సంవత్సరాలు అమ్మవారికి సేవ చేసుకుంటున్నట్లు తెలిపాడు. అక్కడి నుంచి కోల్‌కతాలోని గంగాసాగర్, కాళీ మైయా ఆలయానికి కూడా మధ్యలో సందర్శించినట్లు వెల్లడించాడు. కాగా ఇటీవల ఇంటికి తిరిగి వెళ్లమని దేవత తనను ఆదేశించిందని హనుమాన్ సైనీ తెలిపాడు. దీంతో సైనీ తన ఇంటికి చేరుకున్నట్లు తెలిపాడు.
చదవండి: ఒడిశా రైలు దుర్ఘటన: వారి బాధ్యత మాదే.. అదానీ కీలక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment