నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Published Sun, Dec 22 2024 12:11 AM | Last Updated on Sun, Dec 22 2024 12:11 AM

నిర్మ

నిర్మల్‌

ఆదివారం శ్రీ 22 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024

ఉపకరణాలతో గణిత బోధన

నిర్మల్‌రూరల్‌: విద్యార్థులకు చార్టులు, బోధనోపకరణాలతో విద్యాబోధన చేస్తున్నారు నర్సాపూర్‌(జి) ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వి.మనోహర్‌రెడ్డి. ప్రాథమికస్థాయి నుంచి ఉపకరణాలతో గణితం బోధించడంలో ఆయన దిట్ట. ఇందుకోసం ఆయన సొంతంగా ఉపకరణాలు తయారు చేసుకున్నారు. రాష్ట్రస్థాయి, సౌత్‌ఇండియా స్థాయి, జాతీయస్థాయిలోనూ తన ఉపకరణాలను ప్రదర్శించి ప్ర శంసలను పొందారు. సులభంగా గణితం బో ధించడానికి తయారు చేసిన స్టడీ మెటీరియల్‌, ఎస్సీఈఆర్టీ ద్వారా రాష్ట్రస్థాయిలో గణిత ఉపాధ్యాయులకు ఇచ్చే వత్యంతర శిక్షణ కార్యక్రమాలు, కరదీపికల రూపకల్పనలో మనోహర్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ప్ర భుత్వ పాఠశాలలో చదివే పేద పిల్లలను ప్రో త్సహించడానికి ట్రస్టు ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఏంటో ఈ తికమక లెక్కలు.. ఎప్పటికీ తప్పవా వీటి తిప్పలు అంటూ కొంతమంది విద్యార్థులు గణితమంటేనే గాబరా పడుతుంటారు. కానీ చిన్న చిన్న చిట్కాలతో చిక్కులు విప్పితే చటుక్కున చేయవచ్చు ఏ లైకె ్కనా. మనిషి జీవితంలో గణితం ఓ అంతర్భాగంగా మారిపోయింది. అందుకే విద్యార్థి దశ నుంచే గురువులు గణితంపై ఆసక్తి పెంపొందించేలా చూడాలి. శ్రీనివాస రామానుజన్‌ పేద కుటుంబంలో పుట్టి మేధావిగా ఎదిగారంటే ఆయనకు లెక్కల్లో అపారమైన ప్రతిభ ఉండటమే కారణం. ఆయన స్ఫూర్తితో ప్రతిఒక్కరూ గణితంలో రాణించాలని ఏటా రామానుజన్‌ జయంతిని జాతీయ గణిత శాస్త్ర దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. జిల్లా స్థాయిలో సైన్స్‌ఫేర్‌ ఏర్పాటు చేసి అందులో గణితంకు సంబంధించి ఎగ్జిబిట్లను ప్రదర్శిస్తున్నారు. నేడు నేషనల్‌ మ్యాథమెటిక్స్‌ డే సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల అభిప్రాయాలతో ప్రత్యేక కథనం.

– ఆదిలాబాద్‌టౌన్‌/నిర్మల్‌ఖిల్లా

గణిత బోధన చేస్తున్న ఉపాధ్యాయురాలు

No comments yet. Be the first to comment!
Add a comment
నిర్మల్‌1
1/2

నిర్మల్‌

నిర్మల్‌2
2/2

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement