నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతన్న మైనారిటీ అభ్యర్థులకు జిల్లాలో బేసిక్స్ ఫౌండేషన్‌పై ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా అల్పసంఖ్యాకవర్గా ల సంక్షేమ అధికారి ఆర్.మోహన్‌సింగ్ ఒక ప్ర కటనలో తెలిపారు. గ్రూప్–1 ప్రిలిమ్స్, గ్రూప్ –2, గ్రూప్–3, గ్రూప్–4 పరీక్షల కోసం కేంద్ర ప్రభుత్వ స్టాప్ సెలెక్షన్ కమిషన్ పోటీ పరీక్షలు, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు లాంటి పోటీ పరీక్షల్లో శిక్షణ కోసం ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు వివరించారు. ఉచిత శిక్షణ 4 నెలలు ఉంటుందని అర్హత, ఆసక్తి కలిగిన మైనారిటీ అ భ్యర్థులు (ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు బౌద్ధులు, జైనులు, పార్శీలు) దరఖాస్తుతోపాటు ఆ ధార్‌కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం, డిగ్రీ మార్కుల మెమో, రెండు పాస్‌పోర్టుసైజ్ ఫొటోలతో కలెక్టర్ ఆఫీసులోని మైనారిటీ సంక్షేమశాఖ అధికారి కార్యాలయంలో ఈనెల 10వ తేదీలోపు అందించాలని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment